మా గురించి

జర్నలిజం అనేది ఒక సామాజిక బాధ్యత. కానీ నేడు అది సామాజిక రుగ్మతలను వ్యాపింపజేసే ఆయుధంగా మారింది.
మీడియా రంగంలో నేడు మెయిన్ స్ట్రీమ్ మీడియాగా చెలామణి అవుతున్న పత్రికలు, టీవీ ఛానెళ్లలో ఎక్కువ శాతం ఏదో ఒక పార్టీకో, వర్గానికో కొమ్ముకాస్తున్నవే. నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా వార్తలను ఉన్నది ఉన్నట్టుగా ప్రసారం చేసే ఛానెళ్లు, పత్రికలు బహు అరుదు.
ఈ దశలో.. ప్రజల యొక్క హితమే పరమసోపానంగా, సత్యశోధనే లక్ష్యంగా మీముందుకు ఈ ప్రజాహితం ద్వారా వస్తున్నాం.

ఎటువంటి ఇజాలకు, భేషజాలకు లొంగకుండా వాస్తవాలను వార్తలు, విశ్లేషణల రూపంలో అందించటమే మా ధ్యేయం.
ఈ క్రమంలో అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ, వాటిని పంచుకునేందుకు ‘ప్రజాహితం’ వేదికగా నిలుస్తుంది. నిర్దిష్టమైన అంశాలపై సహేతుక విమర్శలు, విశ్లేషణలు, ఆరోగ్యవంతమైన చర్చలకు ఎల్లప్పుడూ ఆహ్వానం పలుకుతాము.
ప్రచురణలో అంతిమ నిర్ణయం సంపాదకవర్గానిదే.

ఎడిటర్-ఇన్-చీఫ్

Pin It on Pinterest

error: Content is protected !!