ఆరెస్సెస్ చీఫ్ జాతీయ జెండా ఎగురవేయడంపై నిషేధం

సర్కులర్ జారీ చేసిన కేరళ రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్-సంఘచాలక్ మోహన్ భాగవత్ గణతంత్ర దినోత్సవం నాడు కేరళలోని ఎయిడెడ్ పాఠశాలలో జాతీయ జెండా ఎగురవేయకుండా నిషేధిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది. మూడు రోజులపాటు జరిగే ఆరెస్సెస్ శిక్షణా శిబిరానికి హాజరయ్యేందుకు వచ్చిన మోహన్ భాగవత్ కేరళ పలక్కడ్ పట్టణంలోని పాఠశాలలో గణతంత్ర దినోత్సవం నాడు జెండా వందనంలో పాల్గొనాల్సివుంది. కేరళ సీపీఐ ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్ ప్రకారం విద్యాసంస్థలకు చెందిన అధికారులు మాత్రమే, అదీ ఉదయం 8.30 గంటల తరువాత మాత్రమే జెండా ఎగురవేయాలి. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం నాడు కూడా మోహన్ భాగవత్ పలక్కడ్ పాఠశాలలో జెండా ఎగురవేయకుండా ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ జెండా ఎగురవేయడంతో అక్కడి జిల్లా కలెక్టర్ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై చర్యలకు సిఫార్సు చేశారు. తాజాగా జారీ చేసిన సర్కులర్ ని ఆరెస్సెస్ కొట్టిపారేసింది. సదరు పాఠశాల ప్రభుత్వానికి చెందినది కాదని, వ్యాస విద్యా పీఠానికి చెందిన ప్రయివేటు పాఠశాల అని, ఆరెస్సెస్ చీఫ్ జెండా ఎగురవేస్తారు అని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణదాస్ చెబుతున్నారు . —

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!