ఆ ఆరోపణలు నిరాధారం: కేరళ కమ్యూనిస్ట్ పార్టీ

కేరళ కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) మరియు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాల కృష్ణన్ కుమారుడు బినోయ్ కొడియేరి మీద వచ్చిన ఆర్ధికపరమైన అభియోగాల నేపధ్యంలో పార్టీ  వివరణ ఇస్తూ తాజా ప్రెస్ నోట్ విడుదల చేసింది. 
 
దుబాయికి చెందిన JAAS Tourism LLC అనే టూరిజం సంస్థ.. బినోయ్ కొడియేరి  తమ వద్ద  13 కోట్ల రూపాయల ఆర్ధిక మోసానికి పాల్పడి దుబాయ్ నుండి మాయం అయ్యాడని, ఆయనను పట్టుకోవడంలో భారత ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేసిందంటూ  మలయాళం మీడియాలో  కొన్ని వార్తలు వచ్చాయి.
 
ఈ క్రమంలో బినోయ్ మీద వచ్చిన ఆరోపణలు నిరాధారమని  CPI (M) పార్టీ కొట్టిపారేసింది. బినోయ్ మీద భారతదేశంలో కానీ దుబాయి లో కానీ ఎటువంటి  ఆర్ధిక పరమైన కేసు లు లేవని, ఆయన విదేశీ ప్రయాణాల మీద ఏ విధమైన ఆంక్షలు లేవు అని పేర్కొన్నది . దీనికి సంబంధించి ఏ మీడియా కూడా ఇంతవరకు ఆధారాలను బయట పెట్టలేదు అని కూడా  తెలిపింది . 
ఈ వ్యవహారంతో కేరళ ప్రభుత్వానికి గాని, కమ్యూనిస్టు పార్టీకి గాని ఎలాంటి సంబంధం లేదు అని తెలిపింది. 25 జనవరి  2018 వరకు బాలకృష్ణన్ కొడియేరి మీద  దుబాయ్ కోర్టుల్లో ఏ విధమైన కేసులు రిజిస్టర్ కాలేదు అని తెలియచేసింది. మీడియా ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని, ఇలా నిరాధారమైన ఆరోపణలు చేయడం చట్టరీత్యా నేరం అని కూడా పేర్కొన్నది .

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!