ఘనంగా గణతంత్ర వేడుకలు

69వ గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన వేడుకల్లో 10 ఆసియాన్ దేశాలకు చెందిన నాయకులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. 
కార్యక్రమంలో భాగంగా తొలుత భారత ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరియు త్రివిధ దళాధిపతులు అమర జవాన్లకు నివాళులు అర్పించారు. అనంతరం రాజపథ్ చేరుకున్న ప్రధాని, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మరియు 10 ఆసియాన్ దేశాల ముఖ్య అతిధులకు స్వాగతం పలికారు. 
గణతంత్ర దినోత్సవ పరేడ్లో భాగంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మహిళా విభాగం ‘సీమా భవాని’కి చెందిన 27 మంది మహిళా సైనికులు మోటార్ బైక్ విన్యాసాల ప్రదర్శనలో పాల్గొన్నారు. 
భారతీయ వాయు దళానికి చెందిన రుద్ర మరియు MI-17 హెలీకాఫ్టర్లు ప్రదర్శనలో పాల్గొన్నాయి.  
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!