ఢోక్లామ్: మరోసారి భారత్ -చైనా ఢీ  తప్పదా? 

ఈ మధ్య జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే చైనా భారత్ ను మళ్లీ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందన్న విషయం అర్థమవుతోంది. 
 
భారత సైనికులు ఉన్న ప్రదేశానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే చైనా భారీగా తమ మిలిటరీని మోహరించింది అన్న విషయం ఈ మధ్యనే శాటిలైట్ ద్వారా వచ్చిన ఛాయా చిత్రాల ద్వారా తెలిసింది. 
ఈ నేపధ్యం లో వచ్చిన వార్తలను భారత ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్లుగా  కనిపించడం లేదు. చైనా తమ భూ భాగం లో నే సైన్యాన్ని మోహరించిందని, దానిని పట్టించుకోవలసిన అవసరం లేదు అని భారత  విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రెస్ బ్రీఫింగ్ లో పేర్కొన్నారు . 
 
కొన్ని రాజకీయ వర్గాలు తమ రాజకీయ లాభాల కోసం ఇలా అబద్దపు ప్రచారాలకు పాల్పడుతున్నాయని, ఢోక్లామ్  వద్ద శాంతికి ఏ ఇబ్బంది లేదని,  భూటాన్ భూభాగంలో చైనా ప్రవేశించలేదని  తెలిపారు. అలాగే  ఒక రాజకీయ పార్టీ గతంలో భారత సైనిక దళానికి చెందిన ఒక బెటాలిన్  ఢిల్లీ మీదకు బయలుదేరింది అని గతం లో ప్రచారం చేసిందని పేర్కొన్నారు. ఈ వార్తలను కొన్ని అమ్ముడు పోయిన మీడియా చానెల్స్ హెడ్ లైన్స్ లో ప్రచురించి ప్రజలలో గందరగోళాన్ని నెలకొనేలా చేశాయని విమర్శించారు.
 
ఏది ఏమైనా చైనా తన బలగాలను పెద్ద మొత్తం లో మోహరించడం అనేదానిని భారత ప్రభుత్వం సీరియస్ గా  తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం పలు వర్గాల్లో వ్యక్తమవుతోంది .

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!