ఫోక్రాన్ సమీపంలో LCH చక్కర్లు

భారత్ ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేసిన తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ (లైట్ కాంబాట్ హెలికాఫ్టర్ – LCH) ఫోక్రాన్ సమీపంలోని జైసల్మేర్ ఫైర్ రేంజిలో తొలిసారిగా చక్కర్లు కొట్టింది. 

భారతీయ రక్షణ పరిశోధన శాఖ, భారతీయ వాయు సేన మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అధికారులు ఈ ప్రయత్నాన్ని పర్యవేక్షించారు. 
 
ఐదున్నర టన్నుల బరువు కలిగిన ఈ హెలికాఫ్టర్ ఆయుధాలను మోసుకువెళ్లడంతో పాటు ఇతర యుద్ధ హెలికాఫ్టర్ల మీద, యుద్ధ ట్యాంకుల మీదా దాడి చేయగలదు. 
అంతేకాకుండా సియాచిన్ వంటి అసాధారణ వాతావరణం కలిగిన ప్రాంతాల్లో కూడా సులభంగా సంచరించగలదు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!