వామపక్ష అధిష్టానంలో ముసలం 

న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు  గురించి  వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (CPI -మార్క్సిస్ట్ ) అధిష్టానంలో భిన్నాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది రాజ్యసభలో తన పదవీ కాలం ముగియబోతున్న సందర్భంగా సీతారాం ఏచూరి, రాజ్యసభ సభ్యుడు అయిన అరుణ్  జైట్లీ దగ్గరకు వెళ్లి  “తన వీడ్కోలు సందర్భంగా   ఉపన్యాసంలో ఏం చెబుతారు?” అని  అడిగినట్లు , దానికి అరుణ్ జైట్లీ “సీతారాం ఏచూరి గారు ఈ సభలోకి మార్క్సిస్ట్ ఐడియాలజీ (ఆలోచనల) తో వచ్చారు కానీ కాంగ్రెస్ అపోలోజిస్ట్ లేదా మద్దతుగా పదవీ విరమణ చేస్తున్నారని చెప్తాను” అన్నట్లు, దానికి సీతారాం ఏచూరి గారు ఆలా చెబితే తన పార్టీ లో తనకు ఇబ్బంది తలెత్తుతుందనీ, అలా చెప్పవద్దని కోరినట్లు కొన్ని జాతీయ వార్త పత్రికలలో వార్తలు వెలువడ్డాయి .
 
అలాగే కాంగ్రెస్ తో పొత్తులో సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్ మధ్య ఏకాభిప్రాయం  కుదరలేదు అని  చివరకు  ప్రకాష్ కారత్ తన పంతం నెగ్గించుకున్నారు అని, ఈ పరిణామం వల్ల కాంగ్రెస్ పార్టీ తో 2019 ఎన్నికలలో సిపిఐ-ఎం పార్టీ పొత్తు పెట్టుకోదు  అని వార్తలు వెలువడ్డాయి .
 
ఆధారం: firstpost.com

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!