విధ్వంసం సృష్టిస్తోన్న ‘పద్మావత్’

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నిర్మించిన ‘పద్మావత్’ సినిమా రిలీజ్ రోజున ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో విధ్వంసక ఘటనలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు గురుగావ్ లోని బస్సులపై దాడులకు పాల్పడ్డారు. 
 
పద్మావత్ చిత్రంపై మొదటినుండీ వివాదాలు ముసురుకున్నాయి. రాజపుత్ర వంశానికి చెందిన వీరనారి రాణీ పద్మావతి పాత్రపై తీసిన ఈ సినిమా ఆమెను అవమానించేదిగా, రాజపుత్ర వంశీయుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ రాజస్థానుకు చెందిన కర్ణిసేన మరియు ఇతర హిందూ సంస్థలు దేశవ్యాప్తంగా మొదటినుండీ అభ్యంతరం వ్యక్తంచేస్తూనే ఉన్నాయి. 
 
అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ రాజ్యంపై దాడి చేస్తున్న సందర్భంలో చిత్తోడ్ మహారాణి పద్మావతి వారి చేతిలో చిక్కకూడదు అనే ఉద్దేశంతో ఆత్మత్యాగం చేస్తుంది. కానీ సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన ఈ చిత్రంలో రాణీ పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య శృంగార సన్నివేశాలు తెరకెక్కించడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!