హార్వర్డ్ ఒక మోసపూరిత యూనివర్సిటీ: డాక్టర్ అయ్యాదురై (ఈ-మెయిల్ సృష్టికర్త)

మసాచుసెట్స్ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ అయ్యాదురై అమెరికాకు చెందిన ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి 45 బిలియన్ డాలర్ల హెడ్జ్ ఫండ్ ఉన్నది అని ( హైరిస్క్ ఇన్వెస్ట్మెంట్ ), హార్వర్డ్ డిగ్రీ లు అన్ని ఫేక్ డిగ్రీ లు అని , గ్రేడ్ లు ఇష్టం వచ్చినట్లు వేస్తారు అని, అక్కడి నిండి వచ్చిన అనేక మంది గ్రాడ్యుయేట్లు రాజకీయ పదవులు అనుభవిస్తున్నారు అని , పైగా వీరందరూ అనేక రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అని పేర్కొన్నారు.

హార్వర్డ్ దగ్గర ఉన్న 45 బిలియన్ డాల్లర్స్ సొమ్ముకి ఇంతవరకు టాక్స్ కట్టలేదు అని, అదే ఒక సామాన్యుడు వద్ద అయితే టాక్స్ ముక్కుపిండి వసూలు చేస్తారు అని పేర్కొన్నారు .
హార్వర్డ్ లో ఈ మధ్య ఒక విద్యార్ధి తనకు గ్రేడ్స్ తక్కువ వచ్చాయి అని ప్రొఫెసర్ వద్ద గొడవ చేస్తే , ఆ ప్రొఫెసర్ ఎలా ఆ విద్యార్థి కు A గ్రేడ్ కు మార్చారో వివరించారు. ఇంకా హార్వర్డ్ యూనివర్సిటీ చేసే అనేక మోసాల విషయాల గురించి వివరించారు.
ఈ మధ్య కాలం లో హార్వర్డ్ యూనివర్సిటీ తమిళ్ చైర్ ను మొదలు పెట్టిన విషయం విదితమే. ఈ నేపధ్యం లో ఆయన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ తమిళ్ చైర్ మీద అనేక సందేహాలు రేకేత్తిస్తున్నాయి.

ఆధారం: youtube.com

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!