ఆప్ ఎమ్మెల్యేల అనర్హత కేసు వెనక్కి తీసుకున్న లాయర్ 

ఆమ్ ఆద్మీ బెదిరింపులే కారణమని వెల్లడి – ఈసీ, రాష్ట్రపతికి లేఖ 

 
27 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ కేసు దాఖలు చేసిన లాయర్ విభోర్ ఆనంద్, ఆప్ పార్టీ నుండి వస్తున్నా బెదిరింపుల నేపథ్యంలో తన కేసును ఉపసంహరించుకోనున్నారు. 
 
2016లో విభోర్ ఆనంద్ 27 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇప్పటికే వీరిలో 10 మందిని కేసులో ఈమధ్యనే ఎలక్షన్ కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారు. కానీ హఠాత్తుగా విభోర్ ఆనంద్ తన పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 
 
ఆప్ కార్యకర్తల నుండి వస్తున్న బెదిరింపులు, భద్రత కల్పించమంటూ పలుమార్లు చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ పోలీసులు పట్టించుకోకపోవడమే దీనికి కారణం అని ఆనంద్ opindia.comకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. 
 
విభోర్ ఆనంద్ పిటిషన్ పై విచారణ పూర్తై మిగిలిన 17 మందిని ఎమ్మెల్యేలను కూడా అనర్హులుగా ప్రకటిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యాంగపరమైన సంక్షోభం ఎదుర్కోక తప్పదు. 
 
ఆధారం: OpIndia.Com
 
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!