“పరిశోధనలే పరిశ్రమల విజయానికి కీలకం” – వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

స్విట్జర్లాండ్లోని డావోస్ నగరంలో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం 48వ వార్షిక సమావేశంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు పాల్గొన్నారు. 

సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశంలో పరిశోధనా కార్యకలాపాల ఆవశ్యకతను ఉద్ఘాటించారు. మంచి ఫలితాలను సాధించేందుకు పరిశోధన మరియు అభివృద్ధి రంగంలో పారిశ్రామిక మరియు విద్యా సంస్థల పరస్పర సహకారం కోసం వేదికను రూపొందించాలని సూచించారు.

“సిలికాన్ వ్యాలీ యొక్క విజయం దాని పరిశోధన సౌకర్యాలలో ఉంది,” అని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రిచ్ (రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ -RICH) ను స్థాపించి, దాదాపు 50 పరిశోధనా సంస్థలను ఒక వేదికమీదకి తీసుకువచ్చిన విషయాన్ని తెలియజేశారు. అలాగే పరిశోధనల్లో పాలుపంచుకునే సంస్థల కోసం T- హబ్, T- వర్క్స్, రిచ్ వంటి వేదికలు తెలంగాణాలో ఉన్నాయి అని తెలిపారు.

సమర్ధవంతమైన పరిశోధనల ఫలితంగా భారత్ కు చెందిన ఇస్రో వంటి సంస్థలు తక్కువ వ్యయంతో భారీ విజయాలు సాదించవచ్చు అని నిరూపిస్తున్నాయని తెలిపారు. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి విషయాల్లో భవిష్యత్తు స్టార్ట్ అప్ కంపెనీలదే అని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని తెలంగాణా ప్రభుత్వం గుర్తించి, తగిన ప్రాధాన్యతనిస్తోంది తెలిపారు.

మేధో సంపత్తి హక్కుల పరిరక్షణలో తెలంగాణా ఆదర్శంగా నిలుస్తుందని, అందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ ఇంటెలెక్టుల్ ప్రాపర్టీ క్రైమ్ యూనిట్ ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ కార్యదర్శి రమేష్ అభిషేక్ వెల్లడించారు.

 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!