బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పట్టుకోసం మావోల వ్యూహ రచన

నిషేధిత భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు) నాయకులు బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కోల్పోయిన పట్టును తిరిగి పొందేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ యొక్క ఇంటలిజెన్స్ విభాగానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. జనవరి 26న ది టెలిగ్రాఫ్ పత్రిక ప్రచురించిన సమాచారం ప్రకారం.. మావోయిస్టులు తమ క్యాడర్ బలోపేతం చేసుకోవడంలో భాగంగా కొత్తగా రిక్రూట్మెంట్లు నిర్వహిస్తూ నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈస్టర్న్ రీజినల్ బ్యూరో ఏర్పాటు చేసి ఝార్ఖండ్ ప్రాంతానికి చెందిన పరబేష్ అలియాస్ సహదేవ్ సొరేన్ ను ఇంచార్జిగా నియమించినట్టు సమాచారం. 

ఆధారం: SATP

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!