ఇండియాకు F-35 టెక్నాలజీ ఇవ్వడం లేదు – లోక్ హీడ్ మార్టిన్

F-35 టెక్నాలజీ విమానాలు తయారుచేసే లోక్ హీడ్ మార్టిన్ సంస్థ ఆ టెక్నాలజీని భారత్ కు ఇవ్వబోతున్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలను ఆ సంస్థ అధికార ప్రతినిధి మైఖేల్ ఫ్రీడ్మాన్ ఖండించారు.

F-35 విమానాలను భారత్ లో తయారు చేసే ఉద్దేశం తమకు లేదని, భారత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన వార్తల్లో ఎంత మాత్రమూ నిజం లేదని, తాము కేవలం F-16 టెక్నాలజీ మాత్రమే భారత్ కు ఇవ్వాలనుకున్నట్లు చెప్పారు.

భారత వాయుసేనలో మిగ్ -21 మరియు మిగ్ -27 విమానాలను త్వర లో ఆపరేషన్స్ నుండి తొలగించే ఆలోచనలో ఉన్నారు. దీని వల్ల  వాయుసేనకు 100 నూతన ఫైటర్ విమానాలు అవసరం అవుతాయి. అయితే లోక్ హీడ్ మార్టిన్ సంస్థ వద్ద ఇప్పటికే అనేక F-35 విమానాల ఆర్డర్లు ఉన్నందున భారత్ కు కావలసిన 100 విమానాలను వెంటనే తయారు చేసి ఇవ్వగలదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోనుంది. ఈ నేపధ్యంలో అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప ఈ కొనుగోలు విషయం ముందుకు సాగడం కష్టమే.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!