ముస్లింలను జైలుపాలు చేయడానికే ట్రిపుల్ తలాక్ బిల్లు: హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి వ్యాఖ్యలు

ముస్లిం పురుషులను జైలుపాలు చేసే కుట్రతోనే కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టిందని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసి వ్యాఖ్యానించారు. 
 
సామాజిక సమస్యలకు ఇటువంటి చట్టాలు పరిష్కారం చూపలేవని, ఈ చట్టం వచ్చినంత మాత్రాన  ట్రిపుల్ తలాక్  విధానం ఆగుతుందా అని ప్రశ్నించారు.  2005 నుండి 2015 సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశంలో 80,000 పైగా వరకట్న మరణాలు సంభవించాయని, నిర్భయ ఘటన అనంతరం కూడా దేశంలో సగటున రోజుకు 22 మంది మహిళలు మరణిస్తున్నారని, ప్రతీ సమస్యకు చట్టం సమాధానం కాదని అన్నారు. 
 
ముస్లిం మహిళలను రోడ్డు పడేసి, పురుషులను జైలుపాలు చేసే కుట్రతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టారని అన్నారు. 
 
ముస్లిం మతపెద్దలు సంప్రదించకుండానే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందని ఆరోపించారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!