సీమ రైతులను ఢిల్లీ తీసుకువెళ్తా.. స్పెషల్ ప్యాకేజీ గురించి ప్రధానితో చర్చిద్దాం – పవన్ కళ్యాణ్

  • నేను భూమితో అనుబంధం ఉన్న రైతుని.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాడిని 
  • గత 20 సంవత్సరాలుగా మీరు నా  సినిమాలు చూసి పెరిగారు, కాబట్టి నేను ఎలాంటివాడినో మీకు  బాగా తెలుసు
  • నాకు రాజకీయాల్లో శత్రువులెవరూ లేరు
 
అనంతపురం జిల్లా గుత్తి రహదారిలో జనసేన పార్టీ కార్యాలయానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రజాసమస్యల పరిష్కారం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చాను అని తెలియజేశారు. గెలుపోటములను పట్టించుకోనని, ఓటు వేసినా వేయకపోయినా నేను ప్రజలకు నిరంతరం అండగానే ఉంటానని చెప్పారు.
మిగతా ప్రసంగం పవన్ కళ్యాణ్ మాటల్లో.. 
“నేను ఓటుబ్యాంక్ రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేయను.. కేవలం ప్రజా రాజకీయాలు మాత్రమే చేస్తాను. నేను మీకోసం, ఈ రాయలసీమ కోసం పని చేస్తాను అని మీకు అనిపిస్తే నన్ను గుర్తుపెట్టుకోండి చాలు. రాయలసీమ పేరు చెప్పగానే నాకు అక్కడి కవులు, కళాకారులు, కళలు స్ఫూరిస్తాయని, సినిమాల్లో చూపినట్టు ఫ్యాక్షన్, ముఠా కక్షలు కాదు. నేను రాయలసీమలో పుట్టకపోయినప్పటికీ ఈ నేల సస్యశ్యామలం చేయడానికి నా ఆఖరిశ్వాస వరకూ కృషి చేస్తాను. ఇక్కడి రైతులను, నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ప్రత్యేక రైల్లో ఢిల్లీ తీసుకువెళతాను. అక్కడ ప్రత్యేక ప్యాకేజీ, ఇతర సమస్యల గురించి ప్రధానితో చర్చిద్దాం”.

One thought on “సీమ రైతులను ఢిల్లీ తీసుకువెళ్తా.. స్పెషల్ ప్యాకేజీ గురించి ప్రధానితో చర్చిద్దాం – పవన్ కళ్యాణ్

  • 27/01/2018 at 10:28 pm
    Permalink

    Nice, hope he is playing with the sentiments

    Reply

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!