ఆంధ్ర బాంక్ అక్రమ లోన్లు-స్టెర్లింగ్ బయోటెక్ కేసు లో అహ్మద్ పటేల్ కు సంబంధాలు !

రూ. 5వేల కోట్ల అవినీతి కేసులో ఆంధ్రాబ్యాంక్ మాజీ డైరెక్టర్ అనూప్ గర్గ్ అరెస్ట్ నేపథ్యంలో దీని సెగలు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి, సోనియా గాంధీ రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ కి తగలనున్నాయా? అహ్మద్ పటేల్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన స్టెర్లింగ్ బయోటెక్ సంస్థతో సంబంధాలు కలిగి ఉండటం, తాజాగా అతడి అల్లుడు ఇర్ఫాన్ సిద్దిఖి ఆదాయపన్ను శాఖ అధికారులకు లంచం ఇవ్వడంలో ముఖ్యపాత్ర పోషించారు అని సిబిఐ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన FIRలో అభియోగాలు మోపబడ్డాయి.

ఈడీ ఇంతకు ముందే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ డీలర్ అయిన గగన్ ధావన్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఈయనతో అహ్మద్ పటేల్కు దగ్గర సంబంధాలున్నాయి.

వడోదరాకి చెందిన స్టెర్లింగ్ బయోటెక్, దానికి ఆధారమైన సందేశరా గ్రూప్ గతంలో బడా ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు లంచం ఇస్తూ దొరికిపోయారు .

సిబిఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానకి కూడా ఈ కంపెనీ నుండి ముడుపులు ముట్టాయి. రాకేష్ ఆస్థాన గతంలో సూరత్ లో పోలీస్ కమిషనరుగా పని చేసేవారు. 2011లో అయన 3. 88 కోట్లు లంచం తీసుకున్నారని ఒక కీలకమైన డైరీలో ఆధారం లభించింది. రాకేష్ ఆస్థాన కొడుకు కూడా స్టెర్లింగ్ బయోటెక్ ఉద్యోగి .

ఈ కేసుకు సంబంధించిన డైరీలను అధికారులు స్టెర్లింగ్ బయోటెక్ సందేశరా గ్రూప్ వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ డైరీలో పేర్కొన్న గుజరాతీ ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులకు కాంగ్రెస్ ముఖ్య నేతలలో ఒకరు అయిన అహ్మద్ పటేల్ మరియు బీజేపీతో సత్సంబంధాలు కలిగిఉన్నారు. ఆస్థాన లాగానే మిగిలిన అధికారులకు చెందిన ఇళ్లను నామమాత్రపు అద్దెతో ఈ కంపెనీకు ఇచ్చారు. ఈ పద్దతి వల్ల ఈ కంపెనీ వాళ్ళకి పెద్ద మొత్తంలో లంచాలు అద్దె రూపంలో చెల్లిస్తూ ఉండేది.

2011 లో ఇన్కమ్ టాక్స్ ఈ కంపెనీకి చెందిన అక్రమాలను అన్నింటిని వెలికితీసింది. కానీ అక్కడ రైడ్స్ జరిగే సమయంలో ఇన్కమ్ టాక్స్ అధికారులకు ఆ కంపెనీ మీద రైడ్స్ ఆపేసి తొందరగా వెళ్లిపోవాలని ఢిల్లీ అధికారుల దగ్గర నుండి వత్తిడి వచ్చింది. కానీ అప్పటికే కొంతమంది నిజాయితీ కలిగిన అధికారులు ఈ డైరీలను జప్తు చేసారు. సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో అనేక విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి . ఇందులో ఎలా బలవంతంగా ఆంధ్రా బ్యాంకుతో స్టెర్లింగ్ బయోటెక్ ఐదు వేల కోట్లను అప్పుగా ఇప్పించారో అన్న విషయం వెలుగులోకి వచ్చింది .

సోనియా గాంధీకి కుడి భజం లాంటి అహ్మద్ పటేల్ను విచారించడానికి , సిబిఐ మరియు ఈడీకి ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్ అనుమతి ఇస్తుందా లేదా అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఇంకో ముఖ్య విషయం.. రాకేష్ ఆస్థాన సిబిఐకి చెందిన రిటైర్డ్ అధికారి. ఈయన మీద సిబిఐ నిష్పక్షపాతంగా విచారణ చేస్తుందా లేదా అన్న విషయం తేలాల్సి ఉన్నది.

ఆధారం: www.pgurus.com

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!