కక్ష సాధింపులో కొత్త పర్వం – ప్రత్యర్థి ఇంటి చుట్టూ ఆరు అడుగుల గుంత తవ్వించిన కాంగ్రెస్ నేత

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేత శివకుమార్ కొత్త తరహాలో ప్రత్యర్థులను సాధిస్తున్నారని ప్రకాష్ ఆరోపిస్తున్నారు. శివకుమార్ సోదరుడు సురేష్ అనుచరగణంతో కలిసి తన ఇంటి చుట్టూ ఆరు అడుగుల గుంత తవ్వించాడని, జనతాదళ్(S)కు చెందిన అభ్యర్థికి ఇచ్చే మద్దతుని ఉపసంహరించుకోవాలని తనను బెదిరించాడని ఆయన తెలిపారు.
ఈ వ్యవహారం మీద కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని, ఆ గుంత వల్ల ఇంట్లోకి వెళ్లడం రావడం చాలా ప్రమాదకరంగ మారిందని పేర్కొన్నారు .
ఏది ఏమైనా శివకుమార్ చూడబోతే చైనాను ఆదర్శంగా తీసుకున్నట్లు ఉన్నారు. చైనాలో కూడా ఇలాగే అక్కడి ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వానికి ఎదురు తిరుగుతారో వారి ఇంటి చుట్టూ గుంత తవ్వి ఇబ్బంది కలిగేలా చేస్తారు. పైన చిత్రం చైనాలోదే..

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!