హైదరాబాద్:కేపీహెచ్బీ – గాజులరామారం రోడ్డు.. ఇక్కట్లు పాలవుతున్న స్థానికులు ….

 

హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ నుండి గాజులరామారం వెళ్లే ఉషాముళ్ళపూడి రోడ్డు పరిస్థితి అధ్వాన్నంగా మారింది. నిత్యం ఏదో ఒక ప్రమాదంతో వాహనదారులకు నరకప్రాయంగా తయారైంది.
ఇదే ప్రాంతంలోని రాజీవ్ గృహకల్ప అపార్టుమెంట్స్ సమీపంలోని సిఖ్ వాడ వద్ద వీధిలైట్లు అనే మాటే లేదు. రోడ్డు నిలువునా సగం కిందకి, సగం పైకి ఎగుడుదిగుడుగా మారి, రోడ్డుపొడవునా ప్యాచ్చీలతో అతుకులబొంతలాగా తయారైంది. ఈ రోడ్డుమార్గంలో వెళ్ళేవారిని నిత్యం ఏదో ఒక ప్రమాదం పలుకరిస్తూనే ఉంటుంది.
GHMC అధికారులకు స్థానికులు ఎన్ని పిర్యాదులు చేస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండటంలేదు.
దీనిపై నవీన్ అనే స్థానికుడు పదేపదే ట్విట్టర్ ద్వారా సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్న ఫలితం మాత్రం శూన్యం. ఇప్పుడు ఈ పత్రిక ముఖం గ సంబంధిత అధికారులకు మరియు సంబంధిత మంత్రులకు విన్నపం చేస్తున్నాం . దయ చేసి స్పందించండి ,
ఏదో ఒక అనుకోని ఘటన జరగకముందే మేల్కొని రోడ్డుని బాగుచేస్తే అదే మహోపకారం అంటున్నారు స్థానికులు.

 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!