భారతీయ పాస్ పోర్టులు ఎలా ఉండాలో అమెరికాకి ఎందుకు?

గత శుక్రవారం భారత విదేశాంగ శాఖ నూతన ఆదేశాలు జారీ చేసింది . ఆ ఆదేశాల ప్రకారం ఇమిగ్రేషన్ చెక్ ఎవరికయితే అవసరమో వారికి ఆరెంజ్ రంగులో ఉన్న పాస్పోర్ట్ , ఇమ్మిగ్రేషన్ చెక్ అవసరం లేని వారికి నీలం రంగులో ఉన్న పాస్పోర్ట్ ఇవ్వబడుతుంది . 10 వ తరగతి వరకు ఎవరు చదువుకోలేదో వారికి ఆరంజ్ పాస్పోర్ట్ ఇవ్వబడుతుంది , అది ఉండే వాళ్ళు గల్ఫ్ దేశాలకు, మరి కొన్ని ఇతర ఆసియా దేశాలకు ప్రయాణించాలి అంటే గవర్నమెంట్ నుండి ముందే క్లియరెన్స్ కు దరఖాస్తు చేసుకోవాలి . ఎందుకంటే కొన్ని దేశాలలో ఉద్యోగాల కోసం వచ్చిన వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తారు అని అందువల్ల ఎక్కువ సెక్యూరిటీ చెక్ అవసరమని , దీని వల్ల చదువు రాని వారికి మేలు కలుగుతుంది అని గవర్నమెంట్ ఉద్దేశం . నీలం పాస్పోర్ట్ ఉన్నవాళ్లకు ఇమిగ్రేషన్ చెక్ అవసరం లేదు . ఈ ఆరంజ్ రంగు పాస్పోర్ట్ వల్ల గల్ఫ్ వెళ్లి మోసపోయే వారి లేదా ఇక్కడ ఏజెంట్ల వల్ల మోసపోయే వారి సంఖ్య తగ్గించ వచ్చు అని విదేశాంగ శాఖ ఆలోచన .

కానీ ఈ నిర్ణయం పెను దుమారానికి తెర తీసింది , అమెరికా ప్రముఖ వార్తా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ లో భారత దేశ ప్రభుత్వం ధనిక మరియు పేద వర్గాల పై వివక్ష చూపుతోంది అని , ఈ రెండు రంగుల పాస్పోర్ట్ వల్ల ప్రజలు రెండు తరగతులుగా విభజింప బడతారు అని విమర్శించింది .

భారత దేశం పై ఈ మధ్య కాలం లో అమెరికా వార్తా పత్రికలు విరుచుకు పడుతున్నాయి . వారి దేశం లో ఎన్నో సమస్యలు ఉన్నా అవి వదిలేసి వేరే దేశపు అంతర్గత వ్యవహారాలలో వేలు పెట్టడం ఎంత వరకు సమంజసం ?

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!