ఒంటరి పోరుకు టీడీపీ సిద్ధం: చంద్రబాబు నాయుడు

రాష్ట్ర బీజేపీ నాయకత్వం టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. టీడీపీ బీజేపీని మిత్రపక్షంగా భావిస్తున్నందువల్లనే తమ నాయకులు ఎలాంటి ప్రతి విమర్శలకు దిగటంలేదని, ఒకవేళ బీజేపీకి పొత్తు ఇష్టం లేకపోతే టీడీపీ ఒంటరి పోరుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

ఇటీవలి కాలంలో రాష్ట్ర బీజేపీ నాయకులు పలుమార్లు టీడీపీని విమర్శిస్తూ తాము వైస్సార్సీపీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆంధ్ర రాష్టానికి ప్రత్యేక హోదా ఇస్తే తాము బీజేపీకి మద్దతు ఇస్తామని వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తరువాత చంద్రబాబు నాయుడు తాము ఒంటరి పోరుకు సిద్ధం అనటం గమనార్హం.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!