పాకిస్తాన్ కె అచ్ఛే దిన్

నిన్న జమ్మూకాశ్మీర్ షోపియాన్ లో కొంతమంది పాకిస్తాన్ మద్దతుదారులు, దేశ వ్యతిరేకులు ఆర్మీ జవాన్లపై దాడికి తెగబడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మ రక్షణకోసం జవాన్లు కాల్పులు జరిపారు. దీంతో కాశ్మీర్ పోలీసులు ఘటనపై FIR దాఖలు చేసి, అందులో భారత జవాన్లను నిందితులుగా చేరుస్తూ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం కేసు బుక్ చేశారు. ఈ పరిణామాలు గమనిస్తే మన ప్రభుత్వం పాలనలో పాకిస్థాన్ అచ్ఛే దిన్ సాధిస్తునట్లు అనిపిస్తోంది .
ఇది కాశ్మీర్లోని మిత్రపక్ష పీడీపీ పార్టీని బుజ్జగించడానికి చేసిన చర్య అని బీజేపీ అభిమానులు సర్ది చెప్పుకోవచ్చు. కానీ దేశం కోసం ప్రాణమిచ్చే మన ఆర్మీ మీద కేసు పెట్టడం కంటే ప్రతిపక్షంలో కూర్చోవడం మేలు. ఇలా ఆర్మీ మీద FIR రిజిస్టర్ చేస్తే అది పనిగట్టుకుని ఆర్మీని సంకటంలోకి నెట్టినట్లు కాదా? ఇలాంటి మతిలేని చర్యల వల్ల ఆర్మీ జవాన్ల ఆత్మ స్థైర్యం దెబ్బతినదా? ఇకపై ఆర్మీ జవాన్లు తమ వీరత్వాన్ని ఇంతకుముందులాగా ప్రదర్శించగలరా? ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో శత్రువుల నుండి దెబ్బలు తినడానికి లేదా చావడానికి మాత్రమే ఉన్నారా? కాశ్మీర్లో నుండి తరిమి వేయబడ్డ పండిట్ల పునరావాసానికి PDP, BJP కూటమి ఇంతవరకు ఏ విధమైన చర్య తీసుకోలేదు. మరి PDPతో BJP జత కట్టడం ఎవరికోసం? చూడబోతే కేవలం అధికారం చేజిక్కించుకోవడం కోసమే అనిపిస్తోంది
ఇది PDPని బుజ్జగించడం కన్నా పాకిస్తాన్ను సంతోషించే చర్యలాగా ఉన్నది. మన దేశంలో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు కాశ్మీర్ లో రాళ్ళూ రువ్వేవాళ్ళు టెర్రరిస్టులు, వారి మద్దతుదారులు అనీ, జమ్మూ కాశ్మీర్ని విడగొట్టే పనిలో ఉన్నారు అని.
అలాంటప్పుడు వాళ్ళ మీద ఆర్మీ చర్య తీసుకునే సమయంలో తమ ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినప్పుడు ఆర్మీ మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే పాకిస్తానుకు ఆఛే దిన్ వచ్చాయి అని తప్పక అనిపిస్తుంది.

Source : Pgurus.com

 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!