మాలెగావ్ కేసు: పురోహిత్ పిటిషన్ పై సమాధానమివ్వాలని మహారాష్త్ర ప్రభుత్వం, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు సుప్రీం ఆదేశం

రాజకీయంగా సంచలనం సృష్టించిన మాలెగావ్ పేలుళ్ల కేసులో తీవ్రవాద చర్యల నిరోధక చట్టం కింద తనను విచారించడాన్ని సవాల్ చేస్తూ శ్రీకాంత్ పురోహిత్ మరియు సమీర్ కులకర్ణి దాఖలు చేసుకున్న పిటిషన్ మీద అభిప్రాయం తెలియజేయాలని సుప్రీం కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వం మరియు జాతీయ దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. 
 
గత ఏడాది డిసెంబర్ 18న ఇదే అంశంపై వీరిద్దరూ దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు తిరస్కరించడంతో వీరు తాజాగా సుప్రీమ్ కోర్టుని ఆశ్రయించారు. 
 
శ్రీకాంత్ పురోహిత్ మరియు సమీర్ కులకర్ణి ప్రస్తుతం బెయిల్ మీద విడుదలయ్యారు. 
 
ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మీద అభియోగాలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో జాతీయ దర్యాప్తు సంస్థ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. 
 
29 సెప్టెంబర్ 2008 మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలెగావ్ గ్రామంలో జరిగిన పేలుళ్లలో ఆరుగురు చనిపోగా 100 మంది దాకా గాయపడ్డారని అంచనా. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!