మేఘాలయాలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది -పాల్ లింగ్ డో

రాబోయే ఎలక్షన్ లో రీజినల్ పార్టీ లే విజయం సాధిస్తాయని యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ లీడర్ పాల్ లింగ్ డో పేర్కొన్నారు. మేఘాలయ ప్రజలు కాంగ్రెస్ తో విసిగి పోయారని , బీజేపీ కు అంతగా మేఘాలయ లో ప్రజాబలం లేదని తెలిపారు . 27 ఫిబ్రవరి న మేఘాలయాలో ఎలెక్షన్లు మొదలవుతాయి. ఈ ఎలక్షన్ లో తమ పార్టీ నే మెజారిటీ సాధిస్తుందని , తామే అధికారం లోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు.
జనవరి మొదటి వారం లో నలుగురు చట్టసభ సభ్యులు, ఒక మాజీ కాబినెట్ మినిస్టర్ బీజేపీ లో చేరారు , ఈ సందర్భంగా బీజేపీ మేఘాలయ లీడర్ మాట్లాడుతూ, తాము సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనే నినాదంతో వెళ్తున్నామని , ఈ నినాదం మేఘాలయ ప్రజల మనసులను గెలుచుకున్నదని. అందువల్ల బీజేపీ కె మెజారిటీ దక్కుతుందని తెలిపారు. ఈ నేపధ్యం లో మేఘాలయ ఎన్నికలు ఆసక్తికరంగ మారనున్నాయి.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!