విదేశాంగ నూతన కార్యదర్శిగా విజయ్ గోఖలే.. ఢోక్లామ్ ఉద్రిక్తతల పరిష్కారంలో కీలకపాత్రదారి

భారత విదేశాంగ శాఖ నూతన కార్యదర్శిగా విజయ్ గోఖలే బాధ్యతలు స్వీకరించారు. 
1981 బ్యాచ్ కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి విజయ్ గోఖలే దౌత్య నిపుణుడిగాను, చైనా, తూర్పు ఆసియా వ్యవహారాల నిపుణుడిగా కూడా పేరుగాంచారు. 
 
20 జనవరి 2016 నుండి 21 అక్టోబర్ 2017 మధ్య కాలంలో చైనాలో భారత రాయబారిగా పనిచేసిన విజయ్ గోఖలే..  73 రోజుల పాటు చైనా-భారత్ దేశాల మధ్య నెలకొన్న ఢోక్లామ్ సరిహద్దు వివాదం సమయంలో సైనికుల ముఖాముఖి వంటి ఉద్రిక్త సమస్య పరిష్కరించే విషయంలో పాత్ర పోషించారు. 
 
గోఖలే పదవీకాలం రెండేళ్ల పాటు కొనసాగుతుంది. చైనా ప్రభావం బారిన ఉన్న నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, మయన్మార్ వంటి సరిహద్దు దేశాలతో సత్సంబంధాలు మొదలైన సవాళ్లు విజయ్ గోఖలే ముందున్నాయి. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!