ఆర్మీపై ఎఫ్.ఐ.ఆర్ ఉపసంహరించుకోకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుంది: స్వామీ హెచ్చరిక

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి జమ్మూకాశ్మీర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సోఫియాన్ ఘటనలో ఆర్మీ జవాన్లపై దాఖలుచేసిన ఎఫ్.ఐ. ఆర్ ఉపసంహరించుకోకపోతే ప్రభుత్వం కుప్పకులడం ఖాయం అని హెచ్చరించారు.

సోఫియాన్ జిల్లాలో రాళ్లు విసిరుతున్న ఆందోళనకారుల్ని చెదరగొట్టి పరిస్థితి అదువుచేసే సమయంలో సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, జరిగిన ఘటన మీద జమ్మూకాశ్మీర్ పోలీసులు ఆర్మీలోని ఘర్వాల్ యూనిట్ మరియు ఆర్మీ మేజర్ మీద సెక్షన్ 302 (హత్య), 307(హత్యాయత్నం)ల కింద కేసు నమోదుచేసి ఎఫ్.ఐ.ఆర్. నమోదుచేయడం సంచలనం సృష్టించింది. ఆర్మీపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ వస్తున్న విజ్ఞప్తిని మెహబూబా ముఫ్టీ ప్రభుత్వం తోసిపుచ్చడంతో బీజేపీ-పీడీపీ పార్టీల సంబంధం మరింత దిగజారింది.

ఈక్రమంలో సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!