త్వరలో సైన్యం కోసం స్వదేశీ తయారీ బులెట్-ప్రూఫ్ జాకెట్లు.. నమూనా సిద్ధంచేస్తున్న అమృతానందమయి యూనివర్సిటీ

మరి కొద్దిరోజుల్లో మన సైనికులు స్వదేశీ తయారీ లైట్ వెయిట్ బులెట్ ప్రూఫ్ జాకెట్లను ధరించబోతున్నారు. స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసే బులెట్ ప్రూఫ్ జాకెట్లకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. దీనికి  సంబంధించిన  నమూనాను తయారీ ప్రాజెక్టును లార్సెన్ అండ్ టర్బో సంస్థతో కలిసి కోయంబత్తూరులోని అమృత విశ్వవిద్యాలయం కలిసి చేపట్టబోతున్నాయి. 
 
ప్రస్తుతం భారత్ అమెరికానుండి దిగుమతి చేసుకుంటున్న ఒక్కో బులెట్ ప్రూఫ్ జాకెట్ కోసం సుమారు 1.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. కానీ ప్రస్తుతం ప్రతిపాదిత స్వదేశీ తేలికపాటి బులెట్ ప్రూఫ్ జాకెట్ తయారీకి ఒక్కోటి కేవలం 50 వేల రూపాయలు మాత్రమే అవుతుందని అంచనా. దీని ద్వారా బిలియన్ డాలర్లు ఆదా  అవుతాయి. 
 
ఈ ప్రతిపాదన కింద కోయంబత్తూరులోని మాతా అమృతానందమయి యూనివర్సిటీలో ప్రయోగశాల ఏర్పాటు, నమూనాల తయారీ కోసం డిఫెన్సె రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇప్పటికే రూ. 10 కోట్లు టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ కింద కేటాయించారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!