రేపటి నుండి ప్రారంభం కానున్న ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం ఈనెల 31 ఒకటి నుండి ఫిబ్రవరి 3 వరకు జరగనుంది. నాలుగు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరను దాదాపు కోటిన్నర మందికి పైగా భక్తులు దర్శించుకుంటారని అంచనా. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నారు. 
 
గతంలో లాగా కాకుండా ఈసారి జాతరలో బస చేసేందుకు విడిది ఏర్పాట్ల కోసం ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ధర వెయ్యి రూపాయలు, రెండు వేల రూపాయలు ఉంటుంది. మేడారం జాతర కోసం ఏర్పాటు చేసిన వెబ్సైట్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు. 
 
మేడారం జాతరలో ఈసారి వివిధ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు 3జి, 4జి సేవలు అందించబోతున్నాయి. ఇందుకోసం తాత్కాలిక సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నాయి. బి.ఎస్.ఎన్.ఎల్ ఉచిత వైఫై సేవలు అందించనుంది. 
 
జాతరకు సంబంధించి మరిన్ని వివరాల కోసం http://www.medaramjathara.com వెబ్సైట్ చూడగలరు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!