మానవత్వాన్ని చాటుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. 

రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న ఓ వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అదే సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు చందన్ సింగ్ (HC 7100) మరియు ఇనాయతుల్లాహ్ ఖాన్ ( HC 8458) 108 అంబులెన్స్ వచ్చేదాకా వేచిచూడకుండా వెంటనే అతడి గుండెపై ఒత్తిడి కలిగించి, ప్రథమచికిత్స చేశారు. దీనితో ఆ వ్యక్తి తిరిగి స్పృహలోకి వచ్చాడు. హైదరాబాద్ పురానాపూల్ వంతెన వద్ద ఈ ఘటన జరిగింది. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!