సరిహద్దుల్లో బంకర్ల నిర్మాణం కోసం సైన్యానికి రూ.370 కోట్లు

సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటులో ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. పాక్-భారత్ మరియు చైనా-భారత్ సరిహద్దుల్లో బంకర్ల నిర్మాణం కోసం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మరియు ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీసు దళాలకు సుమారు 370 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలోని 2,526.86 కిలోమీటర్ల మేర (LOC 237.2 కి.మీ సహా) మరియు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు పొడవునా 4096.7 కిలోమీటర్ల మేర పహారాకాస్తున్నాయి. 
 
ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీసు దళాలు భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో 3,488 కిలోమీటర్ల మేర పహారా కాస్తున్నాయి. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!