తెలంగాణాలో హోంగార్డుల వేత‌నాలు పెంపు

తెలంగాణలో హోంగార్డుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. వారి భత్యాలను సైతం రూ. 400 నుంచి రూ.675లకు పెంచుతూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. ఇకపై హోంగార్డులకు నెలసరి గౌరవ వేతనం రూ.20,250లు అందనుంది. ప్రతి ఏప్రిల్‌ నుంచి వారికి వెయ్యి చొప్పున పెంచనున్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. హోంగార్డులకు రెండు పడక గదుల ఇళ్లు, ఆరోగ్య బీమా సదుపాయం కల్పించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ట్రాఫిక్‌ విధులునిర్వర్తించే  హోంగార్డులకు పోలీసుల తరహాలో గౌరవవేతనంపై 30 శాతం అదనంగా ఇవ్వనున్నారు. మహిళా హోంగార్డులకు ఆరు నెలలు మాతృత్వపు సెలవులు, పురుష హోంగార్డులకు 15 రోజులపాటు పితృత్వపు సెలవులు మంజూరు చేయాలని నిర్ణయిస్తూ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. 

 

ఆధారం: ఈనాడు 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!