పార్లమెంట్లో బడ్జెట్ సెషన్ నడుస్తుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు?

దేశం యావత్తు టెలివిజన్లు, మొబైళ్ళలో బడ్జెట్ వివరాలు తెలుసుకుంటున్న వేళ.. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆర్ధిక మంత్రి సుదీర్ఘంగా బడ్జెట్ ప్రసంగం చేస్తుండగా.. ప్రతిపక్ష నేతలు అరుణ్ జైట్లీ ప్రసంగానికి అప్పుడప్పుడు అడ్డుపడుతూ, ప్రశ్నలు సంధిస్తూ, సందేహ నివృత్తి  పొందుతూ కనిపించగా..  ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ మాత్రం అవేమీ తనకు పట్టనట్టు, కనీసం ఆ లెక్కలు, సంఖ్యలతో సంబంధం లేనట్టు మౌనంగా కూర్చున్నారు. రాహుల్ చిరకాల మిత్రుడు, ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా అతనికి అరుణ్ జైట్లీ ప్రసంగంలోని విషయాలను ఎప్పటికప్పుడు వివరిస్తూ కనిపించారు. 
 
 
దీనికి కారణం బడ్జెట్ మీద రాహుల్ గాంధీకి అవగాహన లేకపోవడమేనని సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!