‘ముఖ్యమంత్రి e-ఐ కేంద్రం’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు 

అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు ఆన్లైన్లో “ముఖ్యమంత్రి e-ఐ కేంద్రం” ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్య శాఖ  మంత్రి  డా.కామినేని శ్రీనివాస్, వైద్య,ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. 
 
రాష్ట్రంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాలలో 115 సెంటర్లలో ప్రారంభించడం జరిగిందని,  ముఖ్యమంత్రి e-ఐ కేంద్రాలలో రోగి వివరాలు నమోదు,అత్యాధునికమైన వైద్య పరికరాల సహాయంతో కంటి చూపు సంబంధిత పరీక్షలు చేస్తారని సీఎం తెలిపారు.  ఫన్డస్ కెమెరా ద్వారా డయాబెటిక్ రెటినోపతి, మాకులర్ డిజెనరేషన్, కేటరాక్ట్, గ్లాకోమా వంటి వ్యాధులను కనుగొంటారని,  మగవారికి, ఆడవారికి, పిల్లలకు వేరుగా 8 రకాల కళ్లజోళ్లను ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. 
 
ఏజెన్సీ ప్రాంతలలో  ఉన్న గిరిజనుల కోసం 21 ఏరియా ఆసుపత్రులలో ప్రారంభించనున్న “SNCU”mini కేంద్రంను ముఖ్యమంత్రి గారు పరిశీలించడం జరిగింది. SNCU కేంద్రాల ద్వారా శిశు మరణాలను అరికట్టవచ్చునని,  ఈ కేంద్రంను రూ.7.19 వ్యయంతో నిర్మిస్తున్నారని తెలిపారు. 
 
మాతృత్వ మరణాలను తగ్గించేందుకు “తల్లి సురక్ష” యాప్ సీఎం ప్రారంభించారు.
 
ఎస్సార్ లకు చెల్లించవలసిన జీతాలు, పీజీ వైద్యా విద్యార్ధులకు స్టయిఫండ్ చెల్లించేందుకు రూ.7 కోట్లు విడుదల చేస్తూ జివో ఇవ్వడం జరిగిందని మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా 14 మెడికల్ కాలేజిలు 14 ఆసుపత్రులు అమరావతిలో వస్తున్నాయి అని తెలిపారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!