రామసేతు 18,400 ఏళ్ల క్రితం నాటిదే!!: తేల్చిచెప్పిన పరిశోధన బృందాల అధ్యయనం

రామసేతు వయస్సు 18,400 ఏళ్లు పైబడే ఉంటుందని మద్రాసు యూనివర్సిటీ  మరియు  అన్నా విశ్వవిద్యాలయాల  పరిశోధన బృందాల అధ్యయనం వెల్లడించింది. తమిళనాడులోని పాంబన్‌, శ్రీలంకలోని మన్నార్‌ దీవి మధ్య సముద్రంలో 35 కిలోమీటర్ల దూరానికి ‘రామసేతు’ ఉంది. లంకకు వెళ్లేందుకు వానరసేన నిర్మించిన వంతెనే రామసేతు అని కొందరు బలంగా విశ్వసిస్తుండగా, ఇది సహజసిద్ధంగా ఏర్పడిందని మరికొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశోధక విద్యార్థుల బృందాలు తాజా అధ్యయనం చేపట్టాయి. అధ్యయనంలో తేలిన వయసు, రామాయణంలో పేర్కొన్న వివరాలతో సరిపోతుండటంతో ఈ పరిశోధన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

పరిశోధన కోసం రామేశ్వరంలోని గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ కేంద్రభాగంలో మూడు చోట్ల రంధ్రాలు చేసి మట్టి, రాతి నమూనాలను 2015 డిసెంబరు 12న సేకరించారు. అధ్యయనం చేశాక రామసేతు 18,400 ఏళ్ల కిందట ఏర్పడినట్టు గుర్తించామని అన్నా విశ్వవిద్యాలయం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెసర్‌, ఈ ప్రాజెక్టు పరిశోధన ప్రిన్సిపల్‌ శ్రీనివాసులు తెలిపారు. ఈ అధ్యయనంలో అన్నా విశ్వవిద్యాలయం పరిశోధకులు కల్పన, ప్రొఫెసర్‌ రాజేశ్వరరావు, మద్రాసు విశ్వవిద్యాలయం అప్లయిడ్‌ జియాలజీ విభాగానికి చెందిన ఎం.జయప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!