షారుక్ ఖాన్ ఫార్మ్ హౌస్ అటాచ్ చేసిన ఆదాయపన్ను శాఖ

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కి చెందిన ఫార్మ్ హౌసుని ఆదాయపన్ను శాఖ అధికారులు జప్తు చేశారు. ముంబైలోని అలీబాగ్ ప్రాంతంలో 19,960 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గల ఈ బంగ్లాను బినామీ ఆస్థి లావాదేవీల నిరోధక చట్టం కింద జప్తు చేశారు. 
 
మొదట వ్య్వసాయం పేరిట ఈ స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఆ స్థలాన్ని డెజా వు ఫార్మ్స్ అనే బినామీ సంస్థకు బదలాయిస్తున్నట్టుగా చూపించి, అందులో విలాసవంతమైన బంగ్లా నిర్మించాడు.  
 
మహారాష్ట్ర చట్టాల ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా వ్యవసాయ భూములను వ్యవసాయేతర సంబంధిత కార్యకలాపాల కోసం బదలాయించడం నేరం. పైగా డెజా వు ఫార్మ్స్ అనే బినామీ సంస్థ కేవలం ఈ స్థలం కోసమే అప్పటికప్పుడు రిజిస్టర్ అవ్వబడింది. 2004 సంవత్సరంలో శ్రీనివాస్ పార్థసారధి మరియు సోమశేఖర్ సుందరేశన్ పేరిట రిజిస్టర్ ఐన డెజా వు ఫార్మ్స్ సంస్థ ఆ తరువాత యాజమాన్య హక్కులు షారుక్ ఖాన్ దంపతులకు బదలాయించబడ్డాయి. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!