ఆరెస్సెస్ పేరిట నకిలీ కరపత్రం సృష్టి.. సంస్థపై దుష్ప్రచారం, కలహాలకు కుట్ర, దర్యాప్తు చేస్తున్న ఐబీ

ఆరెస్సెస్ పేరిట సృష్టింపబడిన ఒక నకిలీ కరపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో పేర్కొన్న విషయాలు సంస్థపై దుష్ప్రచారం చేసే విధంగా, మతకలహాలు సృష్టించేవిధంగా ఉన్నాయి. ఇంగ్లీషులో టైపు చేసి ఉన్న ఆ కరపత్రం ఆరెస్సెస్ నేషనల్ డైరెక్టర్ పేరిట ఉంది. నిజానికి ఆరెస్సెస్ సంస్థలో నేషనల్ డైరెక్టర్ అనే హోదా లేదు. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఇది వ్యాపిస్తుండడంతో ఇంటెలిజెన్స్ శాఖ దీనిపై దృష్టి పెట్టింది. దీన్ని ఎవరు తయారుచేశారు, దాని మూలాలు కనుగొనే పనిలో అధికారులు ఉన్నట్టు సమాచారం. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!