కాంగ్రెసును తిరిగి వెంటాడనున్న బోఫోర్స్ భూతం!!

దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన బోఫోర్స్ అవినీతి కేసు తిరిగి కాంగ్రెస్ పార్టీని వెంటాడనుంది. 2005లో ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన ఈ కేసుపై పునర్విచారణ జరిపించాలంటూ సీబీఐ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. 
 
1986 మర్చి 24న స్వీడన్ దేశానికి చెందిన ఆయుధాల కంపెనీ బోఫోర్స్  భారత ప్రభుత్వంతో 410 హొవిట్జ్ 155ఎంఎం ఆయుధాల కొనుగోలుకు సంబంధించి 285 మిల్లియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. అది జరిగిన సంవత్సరానికి, ఏప్రిల్ 16, 1987న స్వీడన్ రేడియో ఒకటి బోఫోర్స్ అవినీతి ఉదంతాన్ని బయటపెట్టింది.  తమ కంపెనీ భారత్ సహా ఏయే దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, అధికారులకు డబ్బు సంచీలు అందించిందో వివరించింది. ఇది జరిగాక భారత ప్రభుత్వం బోఫోర్స్ కంపెనీని బ్లాక్ లిస్టులో ఉంచింది. 
 
బోఫోర్స్ కంపెనీకి, అప్పటి భారత ప్రభుత్వానికి మధ్యవర్తిగా వ్యవహరించిన ఇటాలియన్ ఆయుధాల వ్యాపారి ఒట్టోవియో ఖత్రోచీ రాజీవ్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. 1980 దశకంలో భారత్ విదేశాలతో చేసుకున్న అనేక వ్యాపార లావాదేవీలకు ఇతడు మధ్యవర్తిత్వం వహించాడు. కేసు విచారణ సమయంలోనే రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. 
 
2005లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి ఢిల్లీ హైకోర్టు బోఫోర్స్ నిందితులపై ఉన్న అన్ని కేసులు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!