గురుకులంలో స్వారోస్ ఆధ్య్వర్యంలో క్రైస్తవ ప్రార్ధనలు! – బయటపడిన వీడియో

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రధాన కార్యదర్శి, ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్వారోస్ సంస్థ గురుకుల పాఠశాలలో క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన క్రైస్తవ ప్రార్ధనల తాలూకు వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.
 
 
గతంలో ప్రవీణ్ కుమార్ మేడారం జాతర, బతుకమ్మ పండుగలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడంతో పాటు, బీఫ్ తినడం వల్లనే తాను ఐపీఎస్ సాధించానని చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఫేస్బుక్లో కూడా కల్బుర్గి, గౌరీ లంకేశ్ హత్యలపై స్పందిస్తూ దేశంలో భావప్రకటనా స్వేచ్చకు చోటులేకుండా పోతోందని వివాదాస్పద పోస్టులు చేశారు. 
 
 
ప్రభుత్వ అధికారి హోదాలో ఉండి, కోరేగావ్-బీమ్ అల్లర్లకు ప్రధానకారకుడిగా భావిస్తున్న గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ, వివాదాస్పద హిందూ వ్యతిరేక రచయిత కంచ ఐలయ్య వంటి వ్యక్తులను ప్రవీణ్ కుమార్ రహస్యంగా కలవడం వంటి ఘటనలు చర్చనీయాంశం అయ్యాయి. 
 
తాజాగా అతని సంస్థ ఆధ్వర్యంలో జరిగిన క్రెస్తవ ప్రార్ధనల తాలూకు వీడియోపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!