“తిరుమలను హిందువుల నుండి దూరం చేసేందుకు కుట్ర”: రాధామనోహర్ దాస్, తుమ్మా ఓంకార్ 

టీటీడీ కార్మిక సంస్థ కాదు, హిందూ ధార్మిక సంస్థ అని హిందూధర్మ ప్రచార సారధి రాధామనోహర్ దాస్ స్వామీజీ అన్నారు. 
 
తిరుమలలో ఉన్న అన్యమతస్థులను తొలగించడం అన్యాయమంటూ ఇటీవల వామపక్ష పార్టీ నేతలు తిరుపతిలో నిర్వహించిన ఆందోళనకు రాధా మనోహర్ దాస్ స్పంచారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధార్మిక సంస్థ అని, అక్కడ రాజకీయ అనుబంధ సంస్థలకు చోటివ్వరాదని అన్నారు. ఈమేరకు హిందూ చైతన్య సమితి అధ్యక్షుడు తుమ్మా ఓంకార్ తో కలిసి టీటీడీ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణ జరగాల్సినచోట కులనామస్మరణ ఏమిటని ప్రశ్నించారు. టీటీడీలో ఉన్న కుల, కార్మిక సంఘాలను వెంటనే రద్దుచేయాలని, అటువంటి సంఘాలను నిర్వహిస్తున్న ఉద్యోగులను వెంటనే విధులనుండి తొలగించాలని డిమాండ్ చేశారు. 
 
 
తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కొన్ని నాస్తిక సంఘాలు తిష్టవేసుకుని ఉన్నాయని, వీటి అజమాయిషీ రోజురోజుకూ పెరిగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తుతో తిరుమలను హిందువుల నుండి దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!