రాజధానిలో రాజ్ భవన్, హైకోర్ట్ నిర్మించినట్టుగా కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించిన ఏపీ ప్రభుత్వం!!

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో రాజ్ భవన్, హైకోర్టుల నిర్మాణం పూర్తయిందా? బయటకి అవి కనిపించకపోయినప్పటికీ నిర్మాణం జరిగినట్టుగా టీడీపీ ప్రభుత్వం కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి జనవరి 2, 2018 నాడు రాజ్యసభలో వైఎస్సార్ సీపీ సభ్యుడు విజయ్ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్ధికశాఖ సహాయమంత్రి పి.రాధాకృష్ణన్ ఇచ్చిన సమాధానం ఏపీ ప్రభుత్వ తీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
 
విజయ్ సాయి రెడ్డి మరియు పి. రాధాకృష్ణన్ మధ్య సాగిన ప్రశ్నోత్తరాలకు సంబంధించిన కాపీ ఈ క్రింద గమనించవచ్చు. 
 
 
i
 
ఇందులో పేర్కొన్న విషయాలను గమనిస్తే.. 
  • అసెంబ్లీ మరియు రాజ్ భవన్ నిర్మాణ కోసం 2014-15 సంవత్సరానికి గాను కేంద్రం ఏపీ ప్రభుత్వానికి ఇచ్చినవి 500 కోట్ల రూపాయలు. 
  • నూతన రాజధాని నిర్మాణం నిమిత్తం  2015-16 సంవత్సరానికి గాను ఇచ్చింది 350 కోట్ల రూపాయలు. 
  • అవసరమైన పట్టణాబివృద్ది కోసం 2015-16 సంవత్సరానికి గాను ఇచ్చింది 200 కోట్ల రూపాయలు. 
  • అవసరమైన పట్టణాబివృద్ది కోసం 2016-17 సంవత్సరానికి గాను ఇచ్చింది 450 కోట్ల రూపాయలు. 
పైవన్నీ కలుపుకుని కేంద్రం ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన మొత్తం 1500 కోట్లు రూపాయలు కాగా అక్కడ తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం తప్ప రాజ్ భవన్ కోసం, హైకోర్టు కోసం కనీసం శంఖుస్థాపన కూడా జరుగలేడన్నది జగమెరిగిన సత్యం. ఇంతకీ ఆ 1500 కోట్ల రూపాయలు ఏమైనట్టు? 
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!