రూ. 864 కోట్ల ఆదాయ పన్ను ఎగవేసిన NDTV – కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?

జనవరి 31న ఎన్డీటీవీ (న్యూఢిల్లీ టెలివిజన్)పై ఆదాయపు పన్ను శాఖ 436 కోట్ల రూపాయల జరిమానా విధించింది. దీంతో ఆ ఛానల్  ప్రభుత్వానికి బకాయిపడ్డ మొత్తం 864 కోట్ల రూపాయలకు చేరింది. ఈ మొత్తంలో చాలావరకు జరిమానాలు, షెల్ కంపెనీల ద్వారా లావాదేవీలు చేసి ఎగకొట్టిన పన్ను, 2009-2010 సంవత్సరంలో ఆదాయాన్ని తప్పుగా డిక్లేర్ చేస్తూ అడ్డంగా దొరికిపోయినప్పుడు విధించిన జరిమానాలు ఉన్నాయి.  300 కోట్ల రూపాయలు విలువైన ఆస్తుల కలిగిన ఎన్డీటీవీ ఇప్పుడు 864 కోట్ల జరిమానా ఎలా కడుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్నగా  మారింది.  ఇప్పుడు ఎన్డీటీవీకి మిగిలింది కోర్ట్ మెట్లు ఎక్కడమే! 
 
ఇంతకుమునుపే ఆదాయపన్ను శాఖ  ఎన్డీటీవీకి సంబంధించిన 30 శాతం షేర్లను జప్తు చేసింది. ఈ షేర్లు ఎన్డీటీవీ అధినేత ప్రణయ్ రాయ్ మరియు రాధికా రాయ్ కు చెందిన షెల్ కంపెనీ  RRPR హోల్డింగ్ పేరు మీద ఉన్నాయి. ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం ఈ 30 శాతం షేర్ల విలువ 100 కోట్ల వరకు ఉండవచ్చు.  ఇప్పుడు అనేక రకాల ఆర్ధిక అవకతవకలకు, మనీ లాండరింగ్ కు  పాల్పడిన ఎన్డీటీవీ మిగిలిన 764 కోట్లు ఎలా ప్రభుత్వానికి  కడుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. 
 
మామూలుగా ఇలాంటి సందర్భాలలో పన్ను ఎగవేతదారుడి బ్యాంకు అకౌంట్లు, ఆదాయపన్ను శాఖ ద్వారా అటాచ్ చేయబడతాయి. ఆ బ్యాంకు అకౌంట్లో ఉండే ధనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. కానీ ప్రస్తుత ఆర్ధిక మంత్రి జైట్లీ నేతృత్వంలోని ఆదాయపు పన్ను శాఖ ఆపని చేయలేదు. ఇది ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం.  ఇన్ని ఆర్ధిక నేరాలున్న నేపధ్యం లో ఇప్పటికన్నాకేంద్ర  ఆర్ధిక శాఖ మరియు అరుణ్ జైట్లీ మేలుకొని ఎన్డీటీవీ బ్యాంకు అకౌంట్లు అటాచ్ చేయాలనీ, రాబోయేకాలంలో  ఎన్డీటీవీ బ్యాంకు అకౌంట్లో వచ్చే ధనం స్వాధీనం చేసుకోవాలని పలువురి ఆర్ధికవేత్తల అభిప్రాయం. ఎందుకంటే ఎన్డీటీవీ దగ్గర పాత కెమెరాలు, కొంచెం భూమి, కొన్ని బిల్డింగ్లు తప్ప ఇంకా వేరే ఆస్తి లేదు. 
 
ఇన్ని ఆర్ధిక నేరాలకు, మనీ లాండరింగ్ కు పాల్పడి, అది కాకుండా పన్ను ఎగవేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఎన్డీటీవీ మీద ఇకమీదనన్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం  ప్రకటనలను వేయడం మానుకోవాలి. ఒక వేళ ప్రకటనలను వేసినా ఆ డబ్బును ఎన్డీటీవీ ప్రభుత్వానికి ఎగవేసిన సొమ్ములో మినహాయించుకోవాలి.  ఆ ప్రకటనలకు రేట్లు కూడా ప్రభుత్వమే నిర్ణయించాలి. 
 
ప్రస్తుత పరిణామాలు గమనిస్తే ప్రభుత్వానికి చెందిన అనేక శాఖలు తమ ప్రకటనల కోసం ఎన్డీటీవీని వాడుకొంటున్నాయి.  ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేయడానికి ప్రయత్నించిన ఎన్డీటీవీ లాంటి సంస్థలకు ఆర్ధికపరంగా ఊతమివ్వడమంటే పాముకు పాలు పోసినట్లు కాదా? ఇంకా విచిత్రం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వానికి చెందిన సుశీల్ చంద్ర, వనజ సర్నా వంటి అనేక మంది ఆర్ధిక శాఖ అధికారులు  ఎన్డీటీవీలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఒక పక్క ఆదాయపన్ను శాఖ ప్రణోయ్ రాయ్, రాధికా రాయ్ పై జరిమాణాలపై జరిమానాలు విధిస్తుంటే, అవేమి పట్టకుండా ఈ అధికారులు నేరానికి పాల్పడ్డ ఎన్డీటీవీలో ఇంటర్వ్యూలు ఇవ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ అధికారులు ఇలాంటి పనులతో ప్రజలకు ఎలాంటి సందేశం పంపిస్తున్నారు? చూడబోతే  నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతిపై పోరులో అంత చిత్తశుద్ధితో ఉన్నట్లు అనిపించడంలేదు. 
 
సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెబీ వంటి ప్రభుత్వ సంస్థలు ఎన్డీటీవీ విషయంలో మందకొడిగా వ్యవహరిస్తున్నాయి. ఇంతవరకు  5 సార్లు సమన్లు పంపినప్పటికీ ప్రణోయ్ రాయ్ మరియు రాధికా రాయ్ లు ఇంతవరకు ఆర్ధికశాఖ ఎదుట హాజరవకుండా రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అయినా వారిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు.  ఇప్పటికన్నా నరేంద్రమోడీ ప్రభుత్వం మేలుకొని చట్ట ప్రకారం ఆర్ధిక నేరస్తులపై చర్యలు తీసుకోవాలి.
 
ఆధారం: www.pgurus.com 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!