ఆర్మీపై ఎఫ్.ఐ.ఆర్ వ్యవహారంలో సభలో సావధాన తీర్మానం ప్రవేశపెట్టిన సుబ్రహ్మణియన్ స్వామి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఆర్మీపై  ఎఫ్.ఐ.ఆర్ నమోదు’ వ్యవహారంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణియన్ స్వామి సభలో సావధాన తీర్మానం ప్రవేశపెట్టారు. 
 
గతకొద్ది కాలంగా స్వామి ఈ వ్యవహారంపై జమ్మూ-కాశ్మీర్ సీఎం మెహబూబా ముప్తీ మరియు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నుండి వివరణ కోరుతున్నప్పటికీ వారు మౌనం వహిస్తుండటం గమనార్హం. 
 
సోఫియాన్ ప్రాంతంలో జరిగిన అల్లర్ల సందర్భంగా జిహాదీ టెర్రరిస్టుల మద్దతుతో ఆందోళనకారులు చేసిన రాళ్ళ దాడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆత్మరక్షణ కోసం ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ క్రమంలో ఆర్మీ తన ప్రత్యేక అధికారాల చట్టం ఏ.ఎస్.ఎఫ్.పీ.ఏ ను వినియోగించుకుంది. తదుపరి సీఎం ముప్తీ ఆదేశాల మేరకు జమ్మూకాశ్మీర్ పోలీసులు ఆర్మీపైనా, అందులోని ముఖ్య అధికారి పైన హత్య అభియోగాలు మోపుతూ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. 
 
ఏ.ఎస్.ఎఫ్.పీ.ఏ చట్టం అమలులో ఉన్న ప్రాంతంలో ఆర్మీపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలంటే అందుకు రక్షణ శాఖ మంత్రి ఆమోదం ఖచ్చితంగా ఉండాల్సిదే. జమ్మూ కాశ్మీర్ సీఎం ముఫ్తి కూడా తానూ నిర్మలాసీతారామన్ తో చర్చించిన తరువాతే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశామని పేర్కొన్నారు. 
 
ఏమిటీ సావధాన తీర్మానం?:
ప్రజాప్రాముఖ్యం ఉన్న సమస్యను అత్యవసరంగా చర్చించేందుకు, ఆ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళేందుకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ తీర్మానం ముఖ్యోద్దేశం సమస్యపై సంబంధిత మంత్రి నుంచి అధికారిక వ్యాఖ్యను కోరడం. సభ నియమాల ప్రకారం కనీసం ఇద్దరు సభ్యులు స్పీకర్ కు ఒక గంట ముందు నోటీసు ఇవ్వాలి.స్పీకర్ అనుమతి లభిస్తే 2.30 గంటలపాటు చర్చ జరుగుతుంది. ఒక విధంగా ఇది ప్రభుత్వ మందకొడితనానికి చికిత్స లాంటిది. 
 
ఈ వ్యవహారంలో ప్రధాని మోడీ కలుగజేసుకుని రక్షణశాఖ మంత్రి నుండి వివరణ కోరాలని స్వామి ట్వీట్ చేశారు. 
 
 
ఈ ఘటన మినహా ఆర్మీపై ఎఫ్.ఐ.ఆర్ నమోదుకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వంలోనూ రక్షణమంత్రి ఆమోదం తెలపలేదు. 
 
ఆధారం: www.pgurus.com

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!