ఇరాన్: హిజాబ్ వేసుకోనందుకు 30 మందికి పైగా మహిళల అరెస్ట్ 

ఈ మధ్యకాలంలో ఇరాన్ లోని ఇస్లామిక్ షరియా చట్టానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. మొన్నామధ్య హిజాబ్ తీసివేసిందన్న ఆరోపణలతో వివా మోవాహెద్ అనే మహిళను అరెస్ట్ చేసారు. ఆ తరువాత వచ్చిన తీవ్రమైన ప్రజావ్యతిరేకత కారణంగా ఆమెను విడుదల చేసినట్టు వార్తలు వచ్చాయి. 
తాజాగా అనేక మంది మహిళలు హిజాబ్ బానిసత్వానికి చిహ్నంగా పేర్కొంటూ అది తీసివేసి రోడ్లమీదకు వచ్చి నిరసన వ్యక్తం చేసారు. ఈ నేపధ్యం లో ఇరాన్ ప్రభుత్వం వారిపై చర్యల్లో భాగంగా దాదాపు 30 మంది పైగా మహిళలను అరెస్ట్ చేసింది. దీనిపట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!