దక్షిణ భారతంలోని హిందూ ఆలయాలను టార్గెట్ చేసిన ఇస్లామిక్ తీవ్రవాదులు?

ఆమధ్య విజయవాడలో కొందరు వ్యక్తులు వాయిస్ ఓవర్ ప్రోటోకాల్ (ఇంటర్నెట్ కాలింగ్) ద్వారా పాకిస్థాన్ లోని తమవారితో సంభాషిస్తుంటే మిలటరీ ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టి పట్టుకున్నాయి. మొన్న తిరుమలకు నడకదారి వద్ద దొరికిన బాంబులు కలకలం రేపాయి. తిరుమల సమీపంలో ఇలా పేలుడు పదార్థాలు దొరకడం ఇది రెండోసారి. ఆ ఘటన ఇంకా మర్చిపోక ముందే నిన్న మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయం దగ్గర ‘అగ్ని ప్రమాదం’. నిజానికి ఆ ప్రమాదం అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. అమ్మవారి ఆలయం సమీపంలోని వేయి కాళ్ళ మండపం దగ్గర ఉన్న దుకాణాల్లో ఉన్నట్లుండి అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 10 షాపులకు పైగా దహనం అయ్యాయి, కానీ గుడికి ఏ విధమైన ప్రమాదం జరగలేదు అని అగ్నిమాపక అధికారులు తెలిపారు.

తాజాగా కేంద్ర ఇంటలిజెన్స్ విభాగం విడుదల చేసిన అలెర్ట్ ప్రకారం హిందూ దేవాలయాల పైన ఉగ్రదాలు జరిగే అవకాశం ఉన్నది. ఈ నేపధ్యంలో తిరుమల దగ్గర దొరికిన బాంబులు, మదురై లో అగ్ని ప్రమాదం ఈ రెండింటికి ఉగ్రవాదులకు ఎమన్నా సంబంధం ఉన్నదా అనే విషయాన్ని విస్మరించరాదు. రక్షణ యంత్రాంగం ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు చేపట్టడం కన్నా ముందే ప్రమాదాన్ని అరికట్టే చర్యలు చేపడితే బాగుంతుందని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!