ప్రజాధనంతో రూ.50వేలు విలువైన కళ్ళజోడు.. కేరళ అసెంబ్లీ స్పీకర్ చర్య 

ఆ కళ్ళజోడు ధర అక్షరాలా యాభై వేల రూపాయలు.. పైగా అది కొన్నందుకు ప్రభుత్వం నుండి రీయింబర్స్మెంట్.. ఇది కేరళ అసెంబ్లీ స్పీకర్ పి.రామకృష్ణన్ ఘనకార్యం. 
 
ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా 2016వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు దాదాపు 4.5 లక్షల రూపాయల వైద్య ఖర్చులు రీయింబర్స్ చేయించుకున్నట్టు తెలిసింది. 
దీనిపై స్పీకర్ స్పందిస్తూ వైద్యుడి సూచన మేరకే రూ. 50 వేల విలువైన కళ్ళజోడు ధరిస్తున్నానని సమాధానమిచ్చారు. 
 
ఇలాంటి వాటికి ప్రభుత్వం రీఇంబర్స్మెంట్ పొందడం అంటే ప్రజాధనం వెచ్చించడమే.  

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!