హిందూ ధర్మమే ముఖ్యం.. స్వార్ధ రాజకీయాల నుండి తప్పుకుంటున్నా: బండి సంజయ్ ప్రకటన 

తెలంగాణ బీజేపీలో అసంతృప్తి వాతావరణం మరింత వేడెక్కింది. తాజాగా కరీంగనగర్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి, తెలంగాణ బీజేపీ ముఖ్య నేత బండి సంజయ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ స్వార్ధ రాకీయాల్లో ఇక ఉండలేనని, హిందూ ధర్మమే ప్రధాన అజెండాగా పనిచేస్తానని తెలిపారు. 
 
 
నమ్మిన సిద్ధాంతాల కోసం అనేకమంది బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పనిచేశారని.. అటువంటి కార్యకర్తలే తనకి స్ఫూర్తి అని సంజయ్ తెలిపారు. నమ్మిన రాజకీయ విలువల కోసం అనేక లాఠీదెబ్బలు తిన్నానని, ఇప్పటికి 7 సార్లు జైలుకి వెళ్ళొచ్చానని, గత అసెంబ్లీ ఎన్నికల్లో అతి స్వల్ప మెజారిటీతో ఓడినప్పటికీ, ఈసారి మాత్రం విజయం తధ్యంమంటూ అన్ని సర్వేలు ప్రకటించినప్పటికీ.. కొందరి స్వార్ధ రాజకీయాలు, అణగదొక్కే ప్రయత్నాల వల్ల ఇక రాజకీయాల నుండి తప్పుకుని ధర్మం కోసమే పనిచేయాలని నిర్ణయించుకున్నానని సంజయ్ ఆవేదనగా తెలిపారు. 
 
తనకు పార్టీ, ధర్మం రెండూ ముఖ్యమేనని.. కానీ పార్టీలో ఉంటూ ధర్మం కోసం పోరాడే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ బీజీపీలో లేదని విమర్శించారు. పార్టీకి తాను ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదని, కానీ ధర్మం అంతిమం కాబట్టి రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటున్నానని స్పష్టం చేసారు. తాను బీజేపీకి వ్యతిరేకం అంటూ తప్పుడు ప్రచారం చేయవద్దు అని కోరారు. 
 
ఇప్పటికే నాయకత్వ లేమి, నిరాశానిస్పృహలతో ఉన్న తెలంగాణ బీజేపీకి, అతికొద్ది మంది ముఖ్యనేతల్లోనూ, తెలంగాణా అత్యంత ప్రజాధారణ కలిగిన నేతల్లో ఒకరైన బండి సంజయ్ రాజీనామా చేయడం శరాఘాతం వంటిదే. ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన రాజాసింగ్ కూడా రాజీనామా చేస్తారంటూ గతకొద్ది కాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. 

One thought on “హిందూ ధర్మమే ముఖ్యం.. స్వార్ధ రాజకీయాల నుండి తప్పుకుంటున్నా: బండి సంజయ్ ప్రకటన 

  • 05/02/2018 at 10:39 am
    Permalink

    Hindu darmam mukyam antu rajakeyalanudi tappukovadam enti….neku daryam leka tappukuntuna anni cheppu…Hindu daramam gurunchi alochiche vadive aeite …vere vadiki neve Chan’s isthunav….dharmo rakshitha rakshitha …adhi Marchi poyava….swardha rajakiyalu antunav …aa swardha rajakiyalu nuvu edhukuku marchakudadhu…

    Reply

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!