అల్-జజీరాపై నిషేధం, NDTVపై చర్యలకు IMC సిఫార్సులు – కానీ అడ్డుపడుతున్నది ఎవరు?

భారతదేశానికి వ్యతిరేకంగా అబద్ధపు కధనాలు, వార్తలు ప్రసారం చేస్తున్నందుకు ఖతార్ కు చెందిన ఛానెల్ అల్-జజీరా ఛానెల్ పైన నిషేధానికి మరియు ఆర్థికపరమైన అవినీతికి పాల్పడిన ఎన్డీటీవీ ఛానెల్ పై చర్యలకు వివిధ శాఖలకు చెందిన అధికార-మంత్రివర్గ కమిటీ (ఇంటర్-మినిస్టీరియల్ కమిటీ) సిఫార్సు చేసింది. సమాచార-ప్రసార, హోం, రక్షణ మరియు స్త్రీ-శిశు సంక్షేమ శాఖలకు చెందిన ముఖ్యమైన అధికారులు, మంత్రులు కలిగిన ఈ కమిటీ గతవారమే  ఈ సిఫార్సుకి సంబంధించిన నిర్ణయం తీసుకుంది. 
 
అల్-జజీరా ఛానెల్ అదే పనిగా కల్పిత కధనాలు ప్రసారం చేస్తోందని కమిటీ పేర్కొంది.  అల్-జజీరాకు నిధులు సమకూర్చే సంస్థలు కొన్ని తీవ్రవాద సంస్థలకు కూడా నిధులను ఇస్తున్నట్టు ఆరోపణలున్నాయి. కాశ్మీర్ అంశం గురించి, అక్కడ జరుగుతున్న ఘటనల పైనా  అల్-జజీరా ప్రసారం చేస్తున్న కధనాలు పూర్తిగా అవాస్తవం, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని భారత్ స్థాయికి ప్రమాదం ఏర్పడేవిధంగా కొన్ని కల్పిత వీడియో క్లిప్పింగులు ప్రసారం చేస్తోందని, భారతదేశంలో  అల్-జజీరా ఛానెల్ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని కమిటీ తేల్చిచెప్పింది. భారత వ్యతిరేక కధనాలు వండివార్చడం కోసం  అల్-జజీరా దేశంలోని అనేక మంది జర్నలిస్టులకు నిధులు అందిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 
 
ఇక్కడ గమనించాల్సిదేమిటంటే..  అల్-జజీరా అమెరికాలో తమ కార్యకలాపాలు 20 ఆగస్టు 2013న ప్రారంభించింది. ఆ తరువాత మూడేళ్లకే, అంటే 16 ఏప్రిల్ 2016న ఆ ఛానెల్ యొక్క కార్యకలాపాలు నిలిచిపోయాయి. అంతేకాకుండా అనేక ఇస్లామిక్ దేశాలు  అల్-జజీరాను నిషేధించాయి. 
 
ఇక ఎన్డీటీవీ విషయానికి వస్తే.. పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, బ్యాంకులను మోసగించడం వంటి తీవ్రమైన ఆర్ధిక నేరాల నేపథ్యంలో ఆ ఛానెల్ పెయిన్ కఠిన చర్యలు తీసుకోవాలని ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ సూచించింది. వీటికి తోడు 2009 నుండి ఎన్డీటీవీ తమ యాజమాన్య మార్పుకు సంబంధించి ఇప్పటివరకు సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు రిపోర్ట్ పంపలేదు. నిబంధనల ప్రకారం ఛానెల్ యాజమాన్య మార్పు జరిగిన పక్షంలో ఖచ్చింతగా సంబంధిత శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. ఇదే విషయమై ఎన్డీటీవీలో చిన్న వాటాదారుడిగా ఉన్న సంజయ్ దత్  మాచార ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేయడం జరిగింది. 
 
ఇదిలా ఉండగా.. కమిటీ సూచనలు అమలు కాకుండా ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడంటు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి ట్విట్టర్లో పేర్కొనడం గమనార్హం.
 
ఇంతకీ ఎవరా వ్యక్తి? స్వామి తరచూ పేర్కొనే శకుని, ఈ వ్యక్తి ఒక్కరేనా అనేది తెలియాల్సి ఉంది. 
 
ఆధారం: www.pgurus.com 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!