ఎండోమెంట్స్ ఆలయ స్థలం కబ్జాకు కుట్ర.. GHMC పేరిట నకిలీ డాక్యుమెంట్లు.. ఎంఐఎం ఎమ్మెల్యే హస్తం?

 
పాతబస్తీలోని యకుత్పురా వెస్ట్ చంద్రానగర్ ప్రాంతంలో గల నల్లపోచమ్మ ఆలయ స్థలం కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
ఈ పురాతన ఆలయం ఎండోమెంట్స్ పరిధిలోకి వస్తుండగా, ఈ మధ్య ఆ ఆలయం చుట్టూ ప్రహారీ గోడ నిర్మించేందుకు దేవాదాయ శాఖ ప్రయత్నం చేసింది. దీన్ని అడ్డుకుంటూ కొందరు ఆ స్థలం GHMCకి చెందుతుందంటూ, అక్కడ ప్లే గ్రౌండ్ నిర్మించాలంటూ కొన్ని డాక్యుమెంట్లు చూపించారు. దీనిపై ఆరాతీస్తే అవి నకిలీ డాక్యుమెంట్లు అని తేలింది. ఎంఐఎం పార్టీకి చిందిన కొందరు ప్రయివేటు వ్యక్తులు ఆలయ భూమిని కబ్జా చేసే ఉద్దేశంతో GHMC పేరిట నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్టు తేలింది. దీనిపై GHMC అధికారులు సర్వే చేయగా, ఆ స్థలం దేవస్థానంకు చెందినదే అని నిర్ధారణ ఐంది. 
 
 
అయినప్పటికీ ఆలయ చుట్టుప్రక్కల, ఆయాల స్థలంలో ప్రహారీ గోడ నిర్మింస్తుండగా  లోకల్ ఎంఐఎం కార్యకర్తలు  అడ్డుపడుతూనే ఉన్నారని భక్తులు తెలిపారు. దీనిపై పోలీసులు జోక్యం చేసుకుని కొంచెం స్థలం ప్లే గ్రౌండ్ కోసం వదిలేయండంటూ సెటిల్మెంట్ చేశారు. ఈ వ్యవహారం వెనుక యాకుత్పురా ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ హస్తం ఉందని, హిందూ దేవాలయ అభివృద్ధికి ఆటంకం కలిగించేందుకే ఇదంతా చేస్తున్నారని స్థానికులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. 
 
స్థానిక భక్తులు విషయాన్ని హోమ్ మంత్రికి వివరించడం జరిగింది. ఇక ప్రభుత్వం నుండి ఎలాంటి పరిష్కారం లభిస్తుందో వేచిచూడాలి. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!