“ఎక్కువ కాలం కాదు.. గొప్పగా జీవించాలి”: వీరమరణం పొందిన కెప్టెన్ కపిల్ కుంద్ ఫేస్బుక్ పరిచయ వాక్యం

 
పరిగెత్తు.. పరిగెత్తలేకపోతే నడుచుకుంటూ వెళ్ళు.. అదీ కష్టమైతే పాకుతూ వెళ్ళు.. కానీ లక్ష్యాన్ని మాత్రం చేరుకో”  – ఇదీ పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన భారత ఆర్మీ కెప్టెన్ తన ఫేస్బుక్లో రాసుకున్న సూత్రం. 
 
ఎక్కువ కాలం కాదు.. గొప్పగా జీవించాలి” –  ఇదీ  కపిల్ కుందు తన ఫేస్బుక్ ప్రొఫైల్లో ఉంచిన పరిచయ వాక్యం ఇది. 
 
 
 
వీటిని బట్టి తెలుస్తుంది అతడి గొప్ప వ్యక్తిత్వం, దేశభక్తి. 23 సంవత్సరాలు కూడా పూర్తిగా నిండని కపిల్ హర్యానాలోని ఒక మారుమూల పల్లెలో జన్మించిన కపిల్ చిన్నతనం నుండే దేశానికి సేవ చేయాలని తపించేవాడు. అందులో భాగంగానే ఆర్మీలో చేరి, చిన్న వయసులోనే కెప్టెన్ అయ్యాడు. 
 
మరో 5 రోజుల్లో అతడి 23వ పుట్టినరోజు. పుట్టినరోజు నాడు తల్లిదండ్రుల దీవెనలు పొందాలని  స్వస్థలానికి రైలు టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడు. ఈలోగా వీరస్వర్గం అలంకరించాల్సి వచ్చింది. 
 
విధివిచిత్రం ఏమిటంటే.. 2012లో అతడి జన్మదినం రోజునే అతడి తండ్రి గుండెపోటుతో మరణించారు. అప్పటికే కపిల్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు. తండ్రి మరణం తాలూకు బాధను గుండెల్లో అదిమిపెట్టుకుని ఆ పరీక్షల్లో 80శతం పైగా మార్కులు సాధించాడు. 
 
 
అతడి త్యాగం వెలకట్టలేనిది. కుంద్ మరణానికి పాకిస్థాన్ పై  ప్రతీకారం తీర్చుకుంటామంటూ  అతడి రెజిమెంట్ కు చెందిన జవాన్లు ప్రతిజ్ఞ చేశారు. 
 
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!