చైనీస్ నావికుడిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది

కోల్కత్త: ఒకపక్క భారత్-చైనాల మధ్య ఘర్షణ వాతావరణం ఉన్నప్పటికీ ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది ఒక చైనా నావికుడిని రక్షించి మానవత్వాన్ని చాటుకున్నారు. 
 
హల్దియా సమీపంలో ఉన్న సాగర్ ద్వీపానికి 64 నాటికల్ మైళ్ళ దూరంలోని ఒక వాణిజ్య బోటులో చైనీస్ వర్తకుడు యాన్ దున్ జియావో  తీవ్ర అనారోగ్యంతో చావుబతుకుల మధ్యనున్న విషయం ఇండియన్ కోస్ట్ గార్డ్ యూనిట్ కి సమాచారం అందింది. వెంటనే కోస్ట్ గార్డ్ సహాయ సిబ్బంది అదే ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న బోటు ICGS రజియా సుల్తానాను అప్రమత్తం చేసి, ఆ చైనీస్ వాణిజ్య పడవ వద్దకు పంపి, యాన్ దున్ జియావోను తమ బోటులోకి చేర్చారు. అనంతరం అతడికి ప్రాథమిక చికిత్సను అందించారు. ప్రస్తుతం అతడు ఇండియన్ కోస్ట్ గార్డ్ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!