తమిళనాడు దేవాలయాలపై క్రైస్తవ మూకల దాడి, దురాక్రమణ యత్నం 

తమిళనాడులోని కళాయార్ కోయిల్ శివాలయం మరియు శివగంగై శివాలయాల్లో కొన్ని క్రైస్తవ మూకలు ప్రవేశించి దేవాలయాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేసినట్టు స్థానిక భక్తుల ద్వారా తెలుస్తోంది. 
 
ఉదయం కొందరు భక్తులు దేవాలయం లోపలి ప్రవేశించగానే కొందరు క్రైస్తవ పాస్టర్లు ఆ సమయంలో జీసస్, మేరీలకు ప్రార్ధనలు చేస్తూ కనిపించారు. ఆలయంలోకి వస్తున్న భక్తులను బయటకు పొమ్మంటూ దౌర్జన్యం చేయసాగారు. ఇదేమిటని ప్రశ్నించగా ఆ ఆలయం ఉన్న స్థలం చర్చీకి చెందినది అని చెప్పారు. భక్తులు స్థానిక పోలీసులకు మరియు హిందూ మక్కల్ కచ్చి కార్యకర్తలకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న కార్యకర్తలు క్రైస్తవ పోస్టర్లను నిలదీయడం జరిగింది. తమ దగ్గర ఉన్న భూమి డాక్యుమెంట్లు చూపమని కోరగా పాస్టర్లు నీళ్లు నమిలారు. 
 
అయితే.. దేవాలయ దురాక్రమణకు ప్రయత్నించిన పోస్టర్లను అరెస్ట్ చేయడం మానేసి పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దెందుకు ప్రయత్నించినా హిందూ మక్కల్ కచ్చి కార్యకర్తలు 11 మందిని అరెస్ట్ చేయడం గమనార్హం. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!